: సమ్మె దిశగా ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె సైరన్ మోగించనున్నారు. 17వేల మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులు క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు సమ్మెబాట పట్టాలని సంఘాలు నిర్ణయించాయి. రేపు ఉదయం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.