: ప్రేమ జంటలను వేటాడిన భజరంగ్ దళ్
భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అంటూ ప్రేమికుల దినోత్సవాన్ని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని కార్యకర్తలు హైదరాబాద్ లో అడ్డుకున్నారు. ఉదయం నుంచీ కార్యకర్తలు నగరమంతా పర్యటిస్తూ ప్రేమ పక్షుల కోసం వేటాడారు. అలా చేతికి దొరికిన మూడు జంటలకు ముచ్చటగా దండలు మార్పించారు. ప్రియుడితో ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయించారు.
చిత్తూరు, కర్నూలు, వరంగల్ తదితర పట్టణాలలోనూ భజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు అడ్డుకున్నాయి. కర్నూలు, తిరుపతిలో వేలంటైన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. తిరుపతిలో వేలంటైన్స్ డే ఆఫర్లను ప్రకటించిన షాపులపై దాడులు చేశారు. కర్నూలులో రెండు ప్రేమ జంటలకు బలవంతంగా పెళ్లి చేయించారు.
ఇక, వరంగల్లులో మంగళ సూత్రాలను చేతబూని భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. కనిపించిన ప్రేమ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. పాశ్చాత్య సంస్కృతికి చెందిన ఇలాంటి పండుగలను భారతీయ యువత అనుసరించడం సరికాదని భజరంగ్ దళ్ పేర్కొంది. నగరంలో అమ్మాయి, అబ్బాయి జంటగా కనిపిస్తే పెళ్లి చేసి పంపిస్తామని నిన్న అధికారికంగా ప్రకటించింది.
దీనిపై ఓ న్యాయవాది మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బలవంతపు పెళ్లిళ్లలను అడ్డుకోవాలని, ప్రేమికులకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో నగరంలో సాయంత్రం 4 గంటల వరకూ పార్కులన్నింటినీ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఏమైనా, మొత్తానికి భజరంగ్ దళ్ హెచ్చరికల ప్రభావం ప్రేమికులపై బాగానే పనిచేసింది. వారి సంచారం హైదరాబాద్ లో చాలా తక్కువగా కనిపించింది. కొన్ని ప్రాంతాలలో అటుగా వస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను చూసి భయంతో ప్రేమజంటలు పరుగులు తీశాయి. ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పార్కుల మూసివేతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వాటిని తెరచి ప్రేమికులను అనుమతించాలని కోరారు. ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
దేశవ్యాప్తంగా..
మరోవైపు దేశంలోని పలు ఇతర ప్రాంతాలలోనూ ప్రేమికుల దినోత్సవానికి విఘ్నాలు ఎదురయ్యాయి. బెంగళూరు, మంగళూరు, మైసూరు, ముంబాయి, అహ్మదాబాద్, జమ్మూలో హిందుత్వ సంస్థలు సంబరాలను అడ్డుకున్నాయి. జమ్మూలో హిందూస్థాన్ శివసేన కార్యకర్తలు వేలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులను దహనం చేశారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. వేలంటైన్స్ డే పేరుతో జరిగే అసభ్యకర చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచిగా నడుచుకోవాలని సూచించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ఇక, ఇండోనేషియా, పాకిస్థాన్ తదితర ముస్లిం దేశాలలోనూ ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. వేలంటైన్స్ డే పేరుతో యుక్తవయసులో శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ముస్లింలు ప్రదర్శన నిర్వహించారు.