: రాయపూర్ చేరుకున్న మన్మోహన్, సోనియా


మావోయిస్టుల దాడిలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొద్దిసేపటి క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు చేరుకున్నారు. అక్కడ మహేంద్ర కర్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. అనంతరం జగదల్ పూర్ లోని మహారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు మహేంద్ర కర్మ మృత దేహాన్ని శవపంచనామా అనంతరం రాయ్ పూర్ కు తరలించారు.

  • Loading...

More Telugu News