: నేడే ఐపీఎల్ ఫైనల్
ఐపీఎల్ లో కీలక సమరానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ రోజు సాయంత్రం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో టైటిల్ పోరు జరుగనుంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో మానసికంగా బలహీనమైన చెన్నై జట్టును ముంబై ఫేవరేట్ గా ఢీకోనుంది. రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు మూడో సారీ టైటిల్ గెలిచి రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతుండగా, 2010లో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై అప్పుడు చెన్నై చేతిలో ఓడింది. ఈసారి ఎలాగైనా గెలిచి, అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై జట్టు మంచి జోరుమీదుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం.