: తెలంగాణ ఇవ్వకపోతే ఛత్తీస్ గఢ్ ఘటనలు ఇక్కడ పునరావృతమవుతాయి: ఎంపీ గుత్తా
టీ కాంగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఏపీలో కూడా ఛత్తీస్ గఢ్ లాంటి ఘటనలు జరుగుతాయని హెచ్చరించారు. ఛత్తీస్ గఢ్ ఘటన ప్రజాస్వామ్యంపై దాడి అని అభిప్రాయపడ్డ ఆయన, కాంగ్రెస్ అధిష్ఠానానికి హెచ్చరికలు చేసారు. ఛత్తీస్ గఢ్ జగదల్ పూర్ లోని దగ్భా ఘాట్ దగ్గర కాంగ్రెస్ రాష్ట్ర ప్రముఖులను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే.