: బాబు పాదయాత్రకు నేడు విరామం


టీడీపీ అధినేత చంద్ర బాబు కాలు బెణకడంతో పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఈ రాత్రికి వైద్యుల బృందం కొలకలూరికి చేరుకొని బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లా కొలకలూరులో ఓ సభా వేదిక మెట్లు కూలిన ఘటనలో బాబు గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న బాబు పాదయాత్ర కొనసాగించేందుకే నిశ్చయించుకున్నట్టు సమాచారం.

పూర్తిగా కోలుకునేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని  కార్యకర్తలు, నేతలు సూచిస్తుండగా.. వైద్య పరీక్షల అనంతరం బాబు పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం వెలువడనుంది. కాగా, చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ పరామర్శించనున్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందుకున్న వెంటనే లోకేశ్, భువనేశ్వరి గుంటూరు పయనమయ్యారు.

  • Loading...

More Telugu News