: ఛత్తీస్ గఢ్ లో మూడు రోజుల సంతాప దినాలు
కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా చేసుకుని 28 మందిని హత్య చేయడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లో ఒక పార్టీకి చెందిన వారిని ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు కాల్చి చంపడం ఇదే మొదటి సారి. మరోవైపు మావోయిస్టుల దాడిని ఖండిస్తూ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఈ రోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.