: సీఎం కిరణ్ తో ఎంపీ కావూరి భేటీ
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి వర్గంలో తనకు చోటు కల్పించలేదని అసంతృప్తితో ఉన్న కావూరి సీఎంతో సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. వీరి సమావేశంలోని అంశాలు బయటకు రానప్పటికీ టీకాంగ్ ఎంపీల తాజా వైఖరిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎంపీలు పార్టీ మారేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు అంచనాకి వచ్చారని సమాచారం. భవిష్యత్తులో పార్టీ పలు సవాళ్లు ఎదుర్కోనుందని వాటిపై పోరాడేందుకు సిద్దంగా ఉండాలని సీఎంకి కావూరి సూచించారు.