: ఆంధ్రప్రదేశ్ లో తొలి అమెరికన్ కార్నర్ ప్రారంభం


హైదరాబాద్ లోని సెయింట్ ప్రాన్సిస్ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా అమెరికన్ కార్నర్ ను ప్రారంభించారు. అమెరికా భారత్ ల మధ్య మరింత మంచి సంబంధాలు ఏర్పడే విధంగా ఈ కార్నర్ ఉంటుందన్న ఆశాభావం తమకు ఉందని నిర్వాహకులు అన్నారు. ఇక్కడ్నుంచి అమెరికాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంపాదించవచ్చని తెలిపారు. అందుకు సంబందించిన అన్ని సౌకర్యాలను సమకూర్చామని, పది అంతర్జాల కంప్యూటర్లతో అమెరికా కార్నర్లో సేవలు అందజేస్తామన్నారు. వీటి ద్వారా అక్కడి, విద్య, వైద్య, సంస్కృత, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల సమాచారం అందుబాటులో ఉంచామని అమెరికా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి వెండీ షెర్మాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News