: మహిళా జర్నలిస్టుతో వాయలార్ అనుచిత ప్రవర్తన, ఆనక క్షమాపణ
కేంద్ర మంత్రి వాయలార్ రవి వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ ఉదంతంలో మీ అభిప్రాయం చెప్పండని అడిగినందుకు, ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలతో ఆగ్రహించిన పాత్రికేయులు తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో వాయలార్ రవి వారికి క్షమాపణ చెప్పారు.
రవి అనుచిత వైఖరికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ.. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీ అన్నారు.