: రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు


రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 135 మంది మృతి చెందారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎండల ధాటికి కుప్పకూలుతున్నారు. ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తుండగా, రికార్డు స్థాయిలో పాల్వంచలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ రోజు నమోదైంది. కొత్తగూడెంలో 48 డిగ్రీలు, రెంటచింతలలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రత రికార్డయింది. మానవ శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే సామర్ధ్యం కలిగి ఉండడంతో భారీ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.

  • Loading...

More Telugu News