: ప్రముఖ నేపధ్య గాయకుడు సౌందర రాజన్ మృతి
ప్రముఖ తమిళ సినీ నేపధ్యగాయకుడు టి.ఎమ్.సౌందరరాజన్ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్ 91 సంవత్సరాల వయసులో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో ఈ రోజు కన్నుమూసారు. తమిళ, తెలుగు, హిందీ సినీ రంగాలకు నేపధ్యగానంతో విశేషసేవలందించిన సౌందరరాజన్ తన గాత్రంతో ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ లకు ప్రాణం పోశారు. సౌందరరాజన్ తెలుగులో ఎన్టీఆర్ నటించిన 'గోపాలుడు భూపాలుడు' సినిమాలో పాటలు పాడారు. సినీ నేపథ్యగానంలో సౌందర రాజన్ ది విశిష్టమైన శైలి. ముఖ్యంగా హై పిచ్ (తారస్థాయి)లో పాడడం ఆయన ప్రత్యేకత.