: గురునాథ్ కు పోలీస్ కస్టడీ
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టయిన గురునాథ్ మెయ్యప్పన్ కు ముంబయి కోర్టు ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది. గురునాథ్.. చెన్నై సూపర్ కింగ్స్ వెంట ఉన్న సమయంలో జట్టు వ్యూహాల గురించి బుకీలకు ఉప్పందించేవాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫిక్సింగ్ తో గురునాథ్ కు సంబంధం ఉందని గట్టిగా విశ్వసిస్తోన్న పోలీసులు.. అతన్ని కస్టడీకి అప్పగిస్తే అందుకు తగిన ఆధారాలను సేకరిస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో అతని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించారు. ఈ ఫోన్ ల కాల్ డేటా విశ్లేషిస్తే బుకీలతో గురునాథ్ సంబంధాలు బట్టబయలవుతాయని ముంబయి క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది.