: రూ.కోటి నగదు, కిలో బంగారంతో పట్టుబడ్డ బుకీ


ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టుల పర్వం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. తాజాగా స్పాట్ ఫిక్సింగ్ తో సంబంధం ఉందని భావిస్తోన్న ఓ బుకీని నేడు అహ్మదాబాద్ లో అరెస్టు చేశారు. వినోద్ మూల్ చందానీ అనే ఈ బుకీ వద్ద నుంచి రూ.1.28 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్ మెంట్ నుంచి మూల్ చందానీ తప్పించుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బుకీ అరెస్టుతో ఫిక్సింగ్ దర్యాప్తు మరింత ముందుకెళుతుందని ఆశిస్తున్నామని అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆప్ పోలీస్ ఏకే శర్మ అన్నారు.

  • Loading...

More Telugu News