: వేయి స్తంభాల గుడిలో రాణీరుద్రమ్మ
వరంగల్ వేయి స్తంభాల గుడిలో 'రాణీ రుద్రమ్మ' ఈ రోజు సందడి చేసింది. చారిత్రక కథాంశంతో దగ్గుబాటి రానా, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు అక్కడ ప్రారంభం అయ్యింది. దర్శకుడు గుణశేఖర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ఈశ్వరుడికి అనుష్క, రాణా అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లడారు. ఈ చిత్రం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నానని, రుద్రమ్మదేవి పాత్రకు న్యాయం చేస్తానని అనుష్క చెప్పారు. ఈ చిత్రంలో పాత్ర తనను వెతుక్కుంటూ రావడం ఆనందంగా ఉందని రానా అన్నారు. వీరిని చూసేందుకు స్థానికులు పోటీ పడ్డారు.