: ఇంటర్నెట్ బిల్లు కట్టాలంటూ వేధింపులు.. 50వేల జరిమానా


ఢిల్లీకి చెందిన రంజన్ మొహపాత్ర ఎయిర్ టెల్ అనుబంధ కంపెనీ భారతీ ఇన్ ఫ్రాటెల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారు. తర్వాత కనెక్షన్ తొలగించాలని కోరినా కంపెనీ తొలగించలేదు. కానీ, ప్రతినెలా బిల్లు పంపడం, ఇస్తవా.. చస్తవా అంటూ కంపెనీ సిబ్బంది వేధించడం మొదలుపెట్టారు. దీనిపై రంజన్ ఢిల్లీ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఫోరం భారతీకి అక్షింతలు వేసి సేవాలోపం కింద రూ.50,000 రంజన్ కు చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News