: విశ్వనాథన్ ఆనంద్ స్థానంలో గురు'నాథుడయ్యాడు'
ప్రముఖ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ స్థానంలో గురునాథ్ మెయ్యప్పన్ వచ్చాడు! ఏంటిది అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కుమార్తె రూపకు తొలుత విశ్వనాథన్ ఆనంద్ తో వివాహం చేయాలని నిశ్చయించారట. శ్రీనివాసన్ దంపతులకు విషీని తమ అల్లుడిగా చేసుకోవాలని ఉన్నా.. అప్పటికే గురునాథ్, రూపలు ప్రేమ వ్యవహారంలో తలమునకలై ఉండడంతో ఇది సాధ్యంకాలేదు. తర్వాత కొన్నాళ్ళకే వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఆ ప్రేమ వివాహం శ్రీనివాసన్ భార్యకు ఇష్టం లేదట. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఈ విషయాలన్నీ గురునాథ్ బావమరిది యోగేశ్ వెల్లడించడం విశేషం.