: 48 గంటలపాటు స్తంభించిపోనున్న దేశం!
దేశం 48 గంటలపాటు స్తంభించిపోనుంది. బస్సులు, ఆటోలు, లారీలు అన్నీ ఆగిపోనున్నాయి. దీంతో కూరగాయలు, ఆహార పదార్థాలు తదితర నిత్యావసర వస్తువులకు రెండురోజుల పాటు కటకట ఏర్పడనుంది.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పూర్తి స్థాయిలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర ఎన్నో కార్మిక సంఘాలు, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ నెల 21, 22 తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో తాము సైతం పాల్గొంటామని హైదరాబాద్ నగరంలోని ఆటో సంఘాలు ప్రకటించాయి. అలాగే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలోనూ ఆటో రవాణా నిలిచిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాలూ సార్వత్రిక సమ్మెకు జై కొట్టాయి. కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న ఆర్టీసీ సంఘాలు హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో సమావేశమయ్యాయి. సమ్మెను విజయవంతం చేసేందుకు సమాలోచనలు జరిపాయి.
ఆర్టీసీలో మిగిలిన సంఘాలను కూడా సమ్మెలో పాల్గొనేందుకు ఒప్పించాలని నేతలు నిర్ణయించారు. దీంతో 48 గంటలపాటు ఆర్టీసీ రవాణా నిలిచిపోనుంది. రానున్నరోజులలో ఇతర రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కూడా సమ్మె దిశగా నడిచే సూచనలే కన్సిస్తున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటే మంచిది!