: బీసీసీఐ చీఫ్ గా అరుణ్ జైట్లీకి అవకాశం?
మేనల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ అరెస్ట్ అనంతరం బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేయాలంటూ శ్రీనివాసన్ పై ఒత్తిడి పెరుగుతోంది. అయినా తాను రాజీనామా చేసేది లేదని, తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటానని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అయితే, బీసీసీఐ పాలకమండలిలో కీలక వ్యక్తి ఒకరు బోర్డు క్రమశిక్షణ కమిటీ చీఫ్ గా ఉన్న అరుణ్ జైట్లీ బీసీసీఐ చీఫ్ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నట్లు సమాచారం. శ్రీనివాసన్ పదవి ఉండడమా, ఊడడమా అన్నది స్పాట్ ఫిక్సింగ్ కేసులో తదుపరి విచారణపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ శ్రీనివాసన్ రాజీనామా చేస్తే జైట్లీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.