: ఆ మాత్రలు వాడితే షుగరొస్తుందట!


శరీరంలో అతిగా పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు ఉపయోగించే మందులతో షుగరు వ్యాధి వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు నిల్వలను కరిగించుకునేందుకు ప్రస్తుతం అనేక రకాలైన మందులు, థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటివి వాడడం వల్ల మనకు ఇదివరకు లేని షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా సిమ్‌వస్టాటిన్‌, అటోర్‌వస్టాటిన్‌ అనే మాత్రలతో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు అక్కడి ఆన్టేరియా అనే ప్రాంతంలోని సుమారు 15 లక్షల మంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. తమ పరిశీలనలో కొవ్వు నియంత్రణ మాత్రల వాడకానికీ, మధుమేహానికీ మధ్య సంబంధాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఇలాంటి మాత్రలను వాడే వారిలో మధుమేహం వస్తున్నట్టు గమనించారు. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి మాత్రలను మోతాదుకు మించి వాడవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News