: ప్లాస్టిక్‌తో పిల్లలకు ప్రమాదం!
ప్లాస్టిక్‌లో ఉండే పాథలేట్ అనే రసాయనం చిన్నారుల్లో గుండెజబ్బులకు కారణం అవుతోందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్స్ యూనివర్సిటీ లాంగాన్ వైద్యకేంద్రం, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, పెన్‌స్టేట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో ప్లాస్టిక్ పదార్ధాల్లో ఉండే పాథలెట్స్ గుండెకు సంబంధించిన వ్యాధులకు కారణం అవుతున్నట్టు కనుగొన్నారు. వీరు సుమారు మూడు వేలమంది చిన్నారులను తమ సర్వే కొరకు ఎంపిక చేసుకున్నారు.
అమెరికాలోని నేషనల్ సెంటర్స్ ఫర్ హెల్త్ స్టాటస్టిక్స్ ఆఫ్ ద సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ నుండి ఆరు సంవత్సరాలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా పరిశోధకులు సేకరించారు. ఈ పరిశోధన గురించి న్యూయార్స్ యూనివర్సిటీకి చెందిన లియోనార్డో ట్రాశాండే మాట్లాడుతూ చిన్నారుల్లో పాథలేట్స్ హృదయ సంబంధ కణాలను నిరోధించడం వల్ల వారిలో ఆమ్ల ఒత్తిడికి గురై ధమనులు దెబ్బతింటాయని, అయితే చిన్నారుల్లో గుండె ఆరోగ్యానికి, పాథలేట్స్‌కి మధ్యగల సంబంధాన్ని మాత్రం ఎవరూ వెల్లడించలేరని తెలిపారు. కాబట్టి ప్లాస్టిక్ వస్తువుల్లో ఉండే ఆహారాన్ని తీసుకునేముందు కాస్త ఆలోచిస్తే ఆరోగ్యానికి మంచిది!