: ఆ ఆరు వ్యాధులకు కారణం జన్యువులే!
మనకు వచ్చే వివిధ రకాలైన వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి. కొన్నింటికి కొత్తగా కనుగొనబడుతున్నాయి. అయితే మధుమేహం, థైరాయిడ్ వంటి ఆరు రకాలైన వ్యాధులు వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఇవి రాకుండా చేయడానికి వీటికి ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. మధుమేహం, ధైరాయిడ్ వంటి ఆరు రకాలైన వ్యాధులకు కారణాలైన జన్యుమూలాలను శోధించేందుకు లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనంలో కొద్ది సంఖ్యలో ఉన్న ముప్పు కలిగించే అరుదైన జన్యు రకాలు ఈ వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించడానికి కారణమని తేల్చారు.
విస్తృతంగా కనిపించే వందలాది బలహీన ప్రభావ రకాల మిశ్రమమే వీటికి దోహదపడుతున్నాయని నిర్ధారించారు. రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ కోల్పోయి, శరీరం సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు తలెత్తుతాయని, వీటిలో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్, సెలియాక్, క్రోన్స్, సొరియాసిస్, మల్టిపుల్ స్కైరోసిస్, టైప్-1 మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని ఈ పరిశోధనలో తేలింది. డేవిడ్ వాన్ హీల్ నేతృత్వంలోని బృందం జరిపిన అధ్యయనంలో ఈ ఆటోఇమ్యూన్ వ్యాధుల ముప్పునకు, కేవలం కొద్ది సంఖ్యలో ఉన్న హైరిస్క్ జన్యురకాలు కాదని, బలహీన ప్రభావం కలిగిన అనేక సాధారణ జన్యు రకాల సంక్లిష్ట మిశ్రమమే కారణమని తేలింది. ప్రతి వ్యాధికి ఇలాంటి జన్యు రకాలు వందల సంఖ్యలో కారణమవుతుంటాయని హీల్ వివరించారు.