: 'దళిత' కార్డు విసురుతోన్న మందా
అసమ్మతి ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఓ అగ్రవర్ణ ఎంపీ రాజీనామా చేస్తే స్పందించిన ప్రధాని, సోనియా.. ముగ్గురు దళిత ఎంపీల విషయంలో మాట్లాడరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి దళితుల అవసరం లేనట్టుందని వ్యాఖ్యానించారు. ఆయన నేడు రాజయ్యతో కలిసి కేకే నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాము విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాతే పార్టీని వీడే విషయమై ఆలోచిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరతామని తాము ఎన్నడూ చెప్పలేదని మందా స్పష్టం చేశారు.