: కడియంపై మండిపడ్డ ఎర్రబెల్లి, రేవూరి


టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పక్షాన చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరిపై మాజీ సహచరులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాశ్ విరుచుకుపడ్డారు. తమ గుట్టు విప్పుతామంటూ కడియం బెదిరిస్తున్నారని, ఆయన తమ రహస్యాల చిట్టా విప్పడం కాదని, తామే ఆయన గుట్టు విప్పుతామని హెచ్చరించారు. వరంగల్ లో నేడు వారు మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కడియంకు మంత్రి పదవి ఇప్పించామని, ఆయన విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇక, బాబుపై ఆరోపణలు చేస్తోన్న కేసీఆర్.. హోం మంత్రి షిండేతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయిస్తే, మహానాడులో తాము తీర్మానం ప్రవేశపెడతామని ఎర్రబెల్లి, రేవూరి సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News