: భారత ఎంబసీ లక్ష్యంగా ఆప్ఘన్ లో టెర్రర్ దాడులు
తీవ్రవాదంతో అట్టుడికిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ లో ముష్కర మూకలు మరోసారి పేట్రేగిపోయాయి. కాబూల్ లోని భారత దౌత్య కార్యాలయం వద్ద నేడు వరుస పేలుళ్ళతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఆత్మాహుతి దళాలు కూడా పాల్గొన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో భారత దౌత్య సిబ్బంది క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేలుళ్ళలో కొందరు స్థానికులకు గాయాలయ్యాయి.