: వడదెబ్బ మృతులకు పరిహారం
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండడంతో ఈరోజే 35 మంది మృతి చెందారు. గత వారంరోజులుగా వందకుపైగా వడదెబ్బ ధాటికి తాళలేక తనువుచాలించారు. మరో వైపు మరో రెండు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ దశలో వడదెబ్బతో మృతి చెందిన వారి వివరాలు ప్రభుత్వానికి పంపాలని మంత్రి రఘువీరారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఆపద్భంధు పథకం కింద వారి కుటుంబాలకు 50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మరో వైపు జేఏసీ అధినేత కోదండరాం మండుతున్న ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని, ఒక్కో మృతుని కుటుంబానికి రెండు లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమండ్ చేసారు.