: చంద్రబాబు కు కేసీఆర్ ఛాలెంజ్
తెలంగాణపై చిత్త శుద్ధి ఉంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. బాన్సువాడ టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న కేసీఆర్ టీడీపీది కపటనాటకమన్నారు. ఎన్నికలు వస్తున్నందున, చంద్రబాబు పాదయాత్ర చేపట్టి ఓట్లకోసం వచ్చే గుంటనక్క వేషాలు వేసారని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 42 రోజులు సకల జనుల సమ్మె చేసినా కేంద్రం స్పందించలేదని ఆయన వాపోయారు.