: క్రైస్తవ సామాజిక వేదిక ఏర్పాటు
సాధికారతే లక్ష్యంగా క్రైస్తవ యువతను, మహిళలను సామాజిక, ఆర్ధిక, విద్యారంగాల్లో ప్రోత్సహించి ప్రయోజకులుగా చేసేందుకు క్రైస్తవ సామాజిక వేదిక ఒకటి ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నింటిని ఒక వేదికపైకి తెచ్చి, ఐక్యత సాదించే దిశగా కృషి చేస్తామని క్రైస్తవ సామాజిక వేదిక చైర్మన్ బిషప్ జాన్ గొల్లపల్లి తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం క్రైస్తవులు సిద్దంగా ఉండాలని, వారి కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకడుగు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు .