: పార్టీని గెలిపించాలన్న తపన నేతల్లో లేదు: టీడీపీ ఎంపీ నామా
పార్టీని గెలిపించుకోవాలన్న తపన తమ పార్టీ ప్రధాన నాయకుల్లో తక్కువగా ఉందని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో మాట్లాడిన ఆయన, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపన కార్యకర్తల్లో అధికంగా ఉందని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.