: ఫిక్సింగ్ స్కాంలో మరో ముగ్గురు క్రికెటర్లు!


క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో మరో ముగ్గురు క్రికెటర్ల అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఉదంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న బాలీవుడ్ నటుడు విందూ సింగ్ తాను మరో ముగ్గురు క్రికెటర్లతోనూ నిరంతరం టచ్ లో ఉన్నట్టు వెల్లడించాడు. ఈ విషయమై ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ఆ ముగ్గురు క్రికెటర్ల కదలికలకు సంబంధించిన వీడియో పుటేజి తమ వద్ద ఉందని తెలిపారు. బుకీలతో వాళ్ళ సంబంధాలపై మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని, అనంతరం అరెస్టు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News