: చిరంజీవి ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ


కేంద్ర మంత్రి చిరంజీవి ఇంటిని నేడు ఓయూ జేఏసీ ముట్టడించింది. ప్రపంచ పర్యాటక సదస్సు సందర్భంగా చిరంజీవి అవినీతికి పాల్పడ్డాడని జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. అంతేగాకుండా, హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. చిరంజీవి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓయూ విద్యార్థులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News