: ఫిక్సింగ్ స్కాంలో 'ఈడీ' వేడి షురూ
క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. పోలీసుల అదుపులో ఉన్న క్రికెటర్లు, బుకీలపై క్రిమినల్ కేసు నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో తన దర్యాప్తును నిర్వహించనుంది. కాగా, ఫిక్సింగ్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలెదుర్కొంటున్న బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ కు ముంబయి క్రైం బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. గురునాథ్ ఇంటివద్ద లేకపోవడంతో చెన్నైలోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. రేపు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.