: బెంగళూరు ఐఐఎంలో బాంబు బూచి
బెంగళూరు ఐఐఎంలో బాంబు పెట్టారన్న ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 12 గంటలకు అపరిచిత వ్యక్తి నుంచి బాంబు పెట్టామన్న ఫోన్ కాల్ రావడంతో సిబ్బంది, విద్యార్థులు అప్రమత్తమయ్యారు. సెలవులు కావడంతో క్యాంపస్ లో తక్కువ మందే ఉండడంతో క్షణాల్లో ప్రాంగణం ఖాళీ అయిపోయింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేసి బాంబులాంటిదేమీ కనిపించకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ పై ఆరా తీయగా జేపీనగర్ పబ్లిక్ బూత్ నుంచి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.