: 'లోకులు పలు కాకులు' అంటోన్న ధోనీ భార్య


ఫిక్సింగ్ వ్యవహారంలో బుక్కయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ తో జతగా తాను కనిపించడంపై మీడియాలో వస్తున్న కథనాల పట్ల ధోనీ భార్య సాక్షి విలక్షణరీతిలో స్పందించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలోకి తన పేరు కూడా వినిపిస్తుండడం పట్ల ఆమె తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. లోకులు పలు కాకులు అని అర్థం వచ్చేలా సాగే ఓ హిందీ చిత్ర గీతాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తద్వారా తన దృక్పథాన్ని చెప్పకనే చెప్పారు. ఎంతటి ఒత్తిడిలోనైనా కూల్ గా వ్యవహరించే టీమిండియా సారథి ధోనీకి తగిన భార్యనని ఈ విధంగా చాటారు.

ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లలో వీఐపీ బాక్స్ లో సాక్షి వెంట విందూ సింగ్ తరచూ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. విందూను ముంబయి క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేయడంతో అతనితో సాక్షి సాన్నిహిత్యం చర్చనీయాంశంగా మారింది. పైగా, ఫిక్సింగ్ ఉదంతంలో మొదట అరెస్టయిన శ్రీశాంత్.. అవినీతి సొమ్ముతో కొన్న బ్లాక్ బెర్రీ ఫోనును తన గాళ్ ఫ్రెండ్ సాక్షి జాలాకిచ్చాడు. ఈ సాక్షి జాలా.. ధోనీ భార్య సాక్షికి క్లాస్ మేట్ కావడం గమనార్హం. ధోనీ భార్యనే సాక్షి జాలాను శ్రీశాంత్ కు పరిచయం చేయడం మరింత విస్మయం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News