: స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయన్న ఆందోళన వద్దు: చిదంబరం
స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెర్నాంకే వ్యాఖ్యల పట్ల ఆందోళన వద్దని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇన్వెస్టర్లకు అభయం ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందించాలని కోరారు. గతేడాది కంటే ఈ ఏడాది ఇంధన రాయితీల కోసం అధికంగా నిధులు కేటాయించామని చిదంబరం గుర్తు చేశారు.