: తీవ్రవాద దాడితో రక్తమోడిన క్వెట్టా


పాకిస్థాన్ నెత్తురోడింది. బాంబు దాడులతో క్వెట్టా నగరం దద్దరిల్లింది. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు పంజా విసిరారు. పాకిస్థాన్ క్వెట్టా నగరంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు ఆటోరిక్షాతో బాంబుదాడి చేసారు. ఆటోరిక్షా ప్రక్కగా బస్సు వెళ్తున్నప్పుడు రిమోట్ తో బాంబు పేల్చారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది భద్రతా సిబ్బంది అక్కడికక్కడ మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News