: ఎవరెస్ట్ పై 80 ఏళ్ల వృద్ధుడి విజయకేతనం
30 ఏళ్ల వయసులో ఐదంతస్తుల భవనంపైకి నడుచుకుంటూ ఎక్కేసరికి ఎగాదిగా రొప్పుతాం. ఆయాసం వచ్చేస్తుంది. అదే 80 ఏళ్ల వయసులో అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ, జపాన్ కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు యుచిరోమిరా ఆడుతూ పాడుతూ ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను ఈ రోజు ఉదయం 8.45గంటలకు అధిరోహించి చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్నాడు. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఎవరెస్ట్ ను అధిరోహించిన వృద్ధుడి రికార్డు 76 ఏళ్ల నేపాలీయుడి పేరిట ఉంది. దాన్ని చెరిపేసి యుచిరోమిరా అక్కడ తన పేరు రాసుకున్నాడు. 8,848 అడుగుల ఎత్తయిన ఈ శిఖరం ఎక్కడానికి యుచిరో తన వెంట ఫిజికల్ ట్రైనర్ ను కూడా తీసుకెళ్లాడు. వాస్తవానికి యుచిరో గతంలో 70, 75 ఏళ్ల వయసప్పుడు కూడా ఎవరెస్ట్ ను ఎక్కాడు.