: రికార్డు సృష్టించనున్న సోలార్‌ ఇంపల్స్‌


సౌరశక్తితో రాత్రీ, పగలూ ప్రయాణించే అత్యాధునిక విమానం సోలార్‌ ఇంపల్స్‌. ఇది తన రెండవ ప్రయాణాన్ని తిరిగి ఆరంభించింది. ఇప్పటికే తొలిసారి 1,116 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విమానం తన రెండవ యాత్రను బుధవారం నాడు అమెరికా ఖండం నుండి ఆరంభించింది. అరిజోనాలోని ఫీనిక్స్‌ విమానాశ్రయం నుండి టెక్సాస్‌లోని డల్లాస్‌కు ఈ విమానం బయలుదేరింది. ఈ రెండింటి మధ్య దూరం సుమారుగా 1,300 కిలోమీటర్లు. ఈ యాత్ర పూర్తయితే సౌర విమాన చరిత్రలో సోలార్‌ ఇంపల్స్‌ సరికొత్త రికార్డు సృష్టించనుంది.

ఈ విమానం ప్రొఫెల్లర్లు 12 వేల సోలార్‌ కణాలు అందించే విద్యుత్తు ద్వారా పనిచేస్తాయి. విమానం నడపడానికి కావలసిన ఇతర శిలాజ ఇంధనం లేకుండానే కేవలం సౌరశక్తితోనే విమానాన్ని నడపడం సాధ్యమేననే విషయాన్ని నిరూపించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ విమానం మే 3న తన తొలి యాత్రను స్విట్జర్లాండ్‌నుండి స్పెయిన్‌కు గంటకు 49 కిలోమీటర్ల వేగంతో 1,116 దూరం ప్రయాణించింది. ఇప్పుడు తన రెండవ ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ విమానంలో 2015 నాటికి ప్రపంచం మొత్తం చుట్టి రావాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ విమానం రాత్రయ్యేసరికి 8,230 మీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడినుండి మెల్లిగా కిందికి దిగుతూ తెల్లవారి సూర్యకిరణాలు తాకేంతవరకు అసలు ఎలాంటి విద్యుత్తును వినియోగించుకోకుండా ప్రయాణిస్తుంది.

  • Loading...

More Telugu News