: ఫోర్బ్స్‌ జాబితాలో సోనియా


ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నిలిచారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ 2013 సంవత్సరానికి ప్రపంచంలో శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సోనియాగాంధీ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. పదవ స్థానంలో పెప్సికో(ఇండియా) ఛీఫ్‌ ఇంద్రా నూయీ నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు, మీడియా, వినోదం, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగం, వ్యవస్థాపన వంటి రంగాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో తొలి వందమంది జాబితాను ఫోర్స్బ్‌ పత్రిక విడుదల చేసింది.

ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వరుసగా మూడోసారి తొలిస్థానంలో నిలిచారు. తరువాత స్థానాల్లో బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌, మిలిందా గేట్స్‌, మిషెల్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు సిఈఓ చందా కొచ్చర్‌ 65వ స్థానంలో ఉండగా, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా 85వ స్థానంలో నిలిచారు. సిస్కో సిస్టమ్స్‌ ఛీఫ్‌ టెక్నాలజీ అండ్‌ స్ట్రాటజీ అధికారి పద్మశ్రీ వారియర్‌ 57వ స్థానంలో ఉండగా, ఓప్రా విన్‌ప్రే 13వ స్థానంలోను, ఆంగ్‌సాన్‌ సూకి 29వ స్థానంలోను, క్వీన్‌ ఎలిజబెత్‌ 40వ స్థానంలోను నిలిచారు. ఏంజలినీ మెర్కల్‌ ఇప్పటికి ఎనిమిది పర్యాయాలు ఈ జాబితాలో స్థానం సంపాదించగా, ఏడుసార్లు ప్రధమ స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News