: యూపీలో సీన్ రివర్సైంది!


ప్రజలకు శాంతిభద్రతలు అందించాల్సిన పోలీసులే సహనం కోల్పోతే, ఆగ్రహంతో ఊగిపోతే.. ఏం జరుగుతుందో చూడాలంటే మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళాల్సిందే. యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ భద్రత సిబ్బందిలో ఇద్దరు నేడు లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. తలలు పగిలి రక్తాలు కారుతున్నా వారు రోడ్డుపై పరుగులు తీస్తూ, ఒకరినొకరు తరుముకుంటూ, భీతావహ వాతావరణాన్ని సృష్టించారు.

సీఎం పాల్గొనే ఓ కార్యక్రమం వద్ద హెడ్ కానిస్టేబుల్ ముకుంద్ యాదవ్, కానిస్టేబుల్ సునీల్ దీక్షిత్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి లాఠీలందుకుని ఫైటింగ్ సీన్ కు తెరలేపారు. ఇంత జరుగుతున్నా సహచరులు చూస్తూ ఉండిపోయారు తప్ప వారిని వారించలేకపోయారు. చివరికి ఈ పోలీస్ ఫైటర్లు గాయపడిన తర్వాత వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News