: ఆనం సోదరులపై జూపూడి ఆగ్రహం


వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో రాజకీయంగా ఎదిగిన ఆనం సోదరులు నేడు మహానేత కుటుంబంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. జగన్ ను ఆర్ధిక ఉగ్రవాది అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జూపూడి మండిపడ్డారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో వందల కోట్లు కుమ్మరించిన ఆనం బ్రదర్సే అసలైన ఆర్ధిక ఉగ్రవాదులని దుయ్యబట్టారు. వైఎస్ కుటుంబంపై ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా కొవ్వూరు అసెంబ్లీ, నెల్లూరు ఎంపీ స్థానాల్లో వారికి పరాజయం తప్పలేదని జూపూడి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News