: టీచర్ పై ఎస్సై లైంగిక వేధింపులు.. టీచర్ అదృశ్యం


ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలలో ఉండి.. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కీచక పోలీసు అధికారి. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన టీచర్ లీలను ఎస్సై సుధీర్ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో సుధీర్ వ్యవహారంపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు సుధీర్ ను బుధవారం సస్పెండ్ చేశారు.

అయితే, ఈ రోజు ఉదయం లీల అదృశ్యమయ్యారు. అదే సమయంలో ఎస్సైపై ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే లీలను చంపుతామంటూ ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఆమెను ఎస్సై సుధీర్ తరఫు వారే కిడ్నాప్ చేసి ఉంటారని లీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News