: అవినీతి నిర్మూలనలో మడమతిప్పం: సోనియా


యూపీఏ సర్కారు ఆరంభం నుంచి ఏదో ఒక కుంభకోణంతో కునారిల్లుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అవినీతి నిర్మూలనలో రాజీపడే ప్రసక్తేలేదని వ్యాఖ్యానిస్తున్నారు. యూపీఏ-2 సర్కారు నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నివాసంలో మిత్ర పక్షాలకు ఇచ్చిన విందులో ఆమె పాల్గొన్నారు. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో మాట్లాడుతూ, పాలన సందర్భంగా తమ ప్రాధామ్యాల నుంచి ఎన్నడూ పక్కకు జరగలేదని చెప్పారు. తమ పాలనలో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల అభ్యున్నతి విషయంలో యూపీఏ గణనీయ ప్రగతి సాధించిందని కితాబిచ్చారు. ఇక ఆహార భద్రత, భూసేకరణ బిల్లుల ఆమోదానికి విపక్షాలు కలిసిరావాలని కోరారు.

  • Loading...

More Telugu News