: 70 లక్షల మందికి ఎయిడ్స్ చికిత్స


ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవీ వైరస్ నియంత్రణకు చికిత్స తీసుకునే వారి సంఖ్య ఆఫ్రికా దేశాలలో గడచిన ఏడేళ్ళలో 10 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దీంతో ఎయిడ్స్ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య 32 శాతం తగ్గిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. బోట్స్ వానా, ఘనా, గాబోన్, మారిషస్, మొజాంబిక్, నమీబియా, సెచెలెన్, సౌతాఫ్రికా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే దేశాలలో మూడొంతుల గర్భవతుల నుంచి శిశువులకు ఈ వైరస్ సంక్రమించకుండా నిరోధించేందుకు చికిత్సను వేగవంతం చేసినట్టు ఐరాస ఎయిడ్స్ వ్యాధినిరోధక సంచాలకుడు మైకేల్ సిడిబే తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్ సంయుక్తంగా ఆఫ్రికా ఖండంలో ఎయిడ్స్, క్షయ, మలేరియా నివారణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

  • Loading...

More Telugu News