: ఆ చట్టాలన్నీ ఆచరణలో విఫలమయ్యాయి: రాఘవులు


సమాజంలో కులవివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా ఆచరణలో విఫలమౌతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం కేవీపీఎస్) రెండో రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. నేటికీ సమాజంలో ఉపాధికి ప్రధాన కేంద్రంగా ఉన్న భూమిహక్కును దళితులు పొందక పోవడంవల్లే కులవివక్ష కొత్తరూపాల్లో విస్తరిస్తోందన్నారు. లక్ష్మింపేట ఘటనతో పాటు అనేక ప్రాంతాల్లో కులవివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్ నిర్మాణాత్మకంగా ఉద్యమిస్తోందని అభినందించారు. ఈ సంఘం ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో 54 రకాల వివక్షలను గుర్తించారని, వాటికి వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేసారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక సాధించడానికి కేవీపీఎస్ పదేళ్ళ సుధీర్ఘపోరాటం చేసింది.

  • Loading...

More Telugu News