: బాబును కలిసిన కాంగ్రెస్ నేత.. ఆనక వివరణ
ఓ పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలను కలవాలంటేనే బయపడుతున్న రోజులివి. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలోనే ఇలాంటి బేటీలు జరుగుతుంటాయని అందరిలోనూ ఓ గట్టి నమ్మకం ఏర్పడింది. తాజాగా, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విషయంలోనూ ఇలాగే జరిగింది. గండ్ర నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలవడం చర్చనీయాంశం అయింది. దీంతో, ఆయనకు వివరణ ఇవ్వక తప్పిందికాదు. తన కుమార్తె వివాహ శుభలేఖ ఇచ్చేందుకు బాబును కలిశానని గండ్ర చెప్పారు. అంతేగానీ, రాజకీయ కారణాలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలవలేదని అన్నారు.