: అంగట్లో 20 వేలకు పసి బిడ్డ


పసిగుడ్డుల్ని అంగట్లో సరకుల్లా అమ్ముకుంటున్నారు. 20 వేల రూపాయలకు పసిబిడ్డను అమ్మకానికి పెట్టారో దంపతులు. నెల్లూరు జిల్లా కావలిలో కడప జిల్లా కు చెందిన మున్నా, దస్తగిరి దంపతులకు ఇటీవలే మగబిడ్డ జన్మించాడు. కావలి బుడబుక్కల కాలనీలో ఆ పసికందును అమ్మకానికి పెట్టిన ఆతల్లిదండ్రులు చిన్నారి తల్లి చనిపోయిందని, బిడ్డను తీసుకుని 20 వేలు ఇవ్వాలని చెబుతూ అదే కాలనీకి చెందిన వెంకటమ్మతో బేరం కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మున్నా, దస్తగిరిమ్మ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News