: యురేనియం ప్లాంటుకు వ్యతిరేకంగా శాస్త్రవేత్తల పోరాటం
కడప జిల్లా వేముల మండలంలో చేపట్టే యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తోంది. స్థానికులకు యురేనియం కర్మాగారం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్గిస్తోంది. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. తాము ముందుండి పోరాటం నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. యురేనియం ప్లాంట్ వల్ల జరిగే అనర్ధాలకు భవిష్యత్ తరాలు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడే పోరాటం చేయాలన్నారు.