: ఇంట్లోనే ఎక్కువసేపుంటే పిల్లల కంటికి నష్టమే


పిల్లలు ఎక్కువసేపు టివి చూడడం, లేదా కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడడం వంటి వాటివల్ల కంటి చూపు తగ్గడం కాదు... ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటే కూడా వారి కంటి చూపు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు జరిపిన ఒక పరిశోధనలో ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలపై పరిశోధన చేశారు. వారంలో కనీసం పది గంటలపాటు ఆరుబయట గడపని పిల్లల్లో కంటిచూపు తగ్గి దృష్టి లోపం ఏర్పడుతోందని వారు గమనించారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కాథ్రిన్‌ రోస్‌ మాట్లాడుతూ చిన్న వయసులో ఆరుబయట సూర్యుని వెలుతురులో గడిపే వారిలో కంటిపాప దీర్ఘవృత్తాకారంలో పెరగకుండా కాపాడుతుందని, తద్వారా దృష్టిదోషం రాకుండా ఉంటుందని అంటున్నారు. అంటే ఆరుబయట ఎక్కువగా గడపడం వల్ల హ్రస్వదృష్టి దోషం రాకుండా కాపాడుకోవచ్చన్నమాట. పాఠశాలలు కూడా పిల్లలకు తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని రోస్‌ చెబుతున్నారు. దీనివల్ల వారిలో దృష్టిదోషం రాకుండా నివారించవచ్చని అంటున్నారు.

  • Loading...

More Telugu News