: అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటాం: ఉగ్రవాద సంస్థల హెచ్చరిక
అఫ్జల్ గురును ఉరి తీసిన భారత దేశంపై పగ తీర్చుకుంటామని పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు ముక్తకంఠంతో ప్రతిన పూనాయి. ఇటీవల మరణశిక్షకు గురైన అఫ్జల్ గురుకు నివాళులు అర్పించేందుకు ఐక్య జిహాద్ మండలి బుధవారం నాడు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో ఓ సమావేశాన్ని నిర్వహించింది.
దీనికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిద్దేన్ వంటి పలు ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు హాజరై ఆవేశపూరితంగా ప్రసంగించారు. భారత ప్రభుత్వం, భద్రతా దళాలపై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని వీరు హెచ్చరించారు.